తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నలుగురు కలెక్టర్లు, 13 మంది కమిషనర్లు, ఎస్పీలను బదిలీకి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డితో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ వీ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజుకు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌శాఖ సంచాలకులు ముషారఫ్ అలీ బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్, వాణిజ్య పన్నులశాఖలకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ కోరింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ప్యానెల్‌ను పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
👉 – Please join our whatsapp channel here