Sports

ఆఫ్ఘనిస్తాన్‌ పై భారత్‌ విజయం

ఆఫ్ఘనిస్తాన్‌ పై భారత్‌ విజయం

ఆఫ్ఘన్ విధించిన 273 పరుగుల విజయ లక్ష్యాన్ని 15 ఓవర్ల ముందే భారత్ చేదించింది. తొలుత లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. సారధి రోహిత్ శర్మ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ పెంచడంపై ద్రుష్టి పెట్టారు. 63 బంతుల్లోనే రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకోగా, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయి పెవిలియన్ బాట పట్టాడు.

భారత్, ఆప్ఘనిస్థాన్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ముందు ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. తొలుత భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. పొదుపుగా పరుగులు ఇచ్చినా.. తర్వాతర్వాత ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, స్టాండ్స్ వైపు మళ్లిస్తూ.. సింగిల్స్ తీస్తూ స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్ సారధి హస్మతుల్లా షాహిద్.. అజ్మతుల్లా ఒమర్ జాయితో కలిసి నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు జత చేశారు. 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటైనా హజ్మతుల్లా షాహిద్ పర్వాలేదనిపించారు.

మరో నాలుగు పరుగుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాల్సిన ఇషాన్ కిషాన్.. 19వ ఓవర్ లో రషీద్ ఖాన్ వేసిన నాలుగో బంతిని ఆడి ఇబ్రహీం జద్రాన్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీం ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి వికెట్ భాగస్వామ్యానికి 156 పరుగులు జత చేశారు. ఔటయ్యే సమయానికి ఇషాన్ కిషన్ వ్యక్తిగత స్కోర్ 47.