Politics

అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన లోకేశ్

అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన లోకేశ్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై కేసులు, ట్రయల్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి లోకేశ్‌ వివరించారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసి విచారణ పేరుతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణినీ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రికి తెలిపారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ఉన్నారు.