తెలంగాణ భవన్ లో ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు దేవరకొండ బిల్యానాయక్, ఆయన అనుచరులు బీఆర్ఎస్ లోకి చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న కేటీఆర్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లకు ఎన్నికలు అంటే ఏటీఎం అని ఆరోపించారు. గతంలో గతంలో ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు నోటు కావాలని విమర్శించారు. ఇప్పుడు రేవంత్‌ను రేవంత్ అనడం లేదు.. రేటెంత అంటున్నారని ఎద్దేవా చేశారు. రోజుకు 48 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ డబ్బా కొడుతోందని.. వారు పాలించిన కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమిత్ షా, ప్రధాని మోదీ ఎన్ని అబద్ధాలాడినా బీజేపీని ప్రజలు తిరస్కరిస్తారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయమని వ్యాఖ్యానించారు. పదేళ్లలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను ఇవ్వని పార్టీ బీజేపీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
👉 – Please join our whatsapp channel here