Editorials

సతీ సావిత్రి కథ …!!

సతీ సావిత్రి కథ …!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿మద్ర దేశాధిపతి అయిన అశ్వపతి మహారాజు కుమార్తె సావిత్రి. నిజానికి, అశ్వపతి, మాళవి దంపతులకు చాలాకాలం దాకా సంతానం కలగలేదు. పిల్లలు పుట్టాలని కోరుతూ ఆ భార్యాభర్తలు పద్దెనిమిదేళ్ళు సావిత్రీదేవిని ఉపాసించారు.

🌸సావిత్రీ దేవి పరప్రసాదంగా వారికి అమ్మాయి పుట్టింది. ఆమెకు సావిత్రి ‘అని పేరు పెట్టి పెంచుకోసాగారు. చదువులో, సౌందర్యంలో, సౌశీల్యంలో సాటి లేని మేటిగా సావిత్రి పెరిగి పెద్దదైంది. సాళ్వ దేశ మహారాజైన ద్యుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడి గుణగణాలు విన్న ఆమె అతని మీద ప్రేమ పెంచుకుంది.

🌿విధివశాత్తూ ద్యుమత్సేన మహారాజు అంధుడయ్యాడు. శత్రుమూకలు దాడి చేసి, రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దాంతో, ఆ రాజు భార్యాపుత్రులతో కలసి అడవుల్లో నివసిస్తున్నాడు. వారందరూ అక్కడ జపధ్యానాదులు చేస్తూ, కఠోర నియమాలు పాటిస్తూ జీవితం గడుపుతున్నారు.

🌸కుమారుడైన సత్యవంతుడు తల్లితండ్రుల బాగోగులు చూస్తూ, వారితోనే ఉంటున్నాడు. అతణ్ణి చిత్రాశ్వుడు అని కూడా పిలుస్తారు. ఎల్లప్పుడూ సత్యమే పలుకుతుంటాడు కాబట్టి అతడు ‘సత్యవంతుడని పేరు పొందాడు.

🌿ఒకసారి అడవిలో కట్టెలు కొట్టి.
ఆ మోపు తీసుకొని వెళుతున్న సత్యవంతుణ్ణి సావిత్రి చూసింది. రాచనగరుకు తిరిగి వచ్చిన తరువాత ఆమె తన తండ్రిని కలసి, సత్యవంతుణ్ణి వివాహమాడాలనే కోరికను వెలిబుచ్చింది. భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన నారద మహర్షి కూడా అప్పుడు రాజ ప్రాసాదంలోనే ఉన్నాడు.

🌸సత్యవంతుడు అల్పాయుష్కుడనే సంగతిని అశ్వపతికి తెలియజేశాడు మహర్షి. మహా తేజస్వి, బుద్ధిమంతుడు, శూరుడు అయిన సత్యవంతుడు ఆ రోజు నుంచి సరిగ్గా ఓ ఏడాది కాలానికి మరణిస్తాడని నారదుడు తెలిపాడు.

🌿అయితే, సావిత్రి మటుకు తన మనస్సు సత్యవంతుడి మీదే లగ్నమై ఉందని స్పష్టం చేసింది. త్రికరణశుద్ధిగా వరించిన సత్యవంతుణ్ణి పెళ్ళాడతానని పేర్కొంది. దాంతో, చివరకు ఆమె కోరినట్లే సత్యవంతుడితో వివాహం జరిగింది. వివాహం తరువాత సావిత్రి కూడా రాజభోగాలన్నీ విడిచిపెట్టి, భర్త వెంట అరణ్యాలకు వెళ్ళిపోయింది.

🌸నిరాడంబర
జీవితం గడుపుతూ, భర్తనూ, అత్తమామల్నీ సేవిస్తూ కాలం గడపసాగింది. అయితే, నారదుడు చెప్పిన భవిష్యత్తును ఆమె మర్చిపోలేదు. సరిగ్గా మరో నాలుగు రోజుల్లో నారదుడు చెప్పిన ఏడాది కాలం పూర్తవుతుందనగా, అత్యంత క్లిష్టమైన త్రిరాత్ర వ్రతాన్ని (మూడు రాత్రుల ఘోర తపస్సు) ఆమె చేపట్టింది.

🌿భర్తను కాపాడాల్సిందిగా రేయింబవళ్ళు సావిత్రీదేవిని ప్రార్థించ సాగింది. అయితే, అంత కష్టంలోనూ, బాధలోనూ ఆమె తన రోజువారీ కర్తవ్యాలను విస్మరించలేదు. మూడు రోజులూ . గడిచిపోయాయి. నారదుడు చెప్పిన ఆఖరి రోజు రానే వచ్చింది.
రోజువారీ పనులన్నీ పూర్తి చేసిన సావిత్రి దుఃఖాన్ని దిగమింగు కుంటూ, అత్తమామల పాదాలకు నమస్కరించింది. వారు, “దీర్ఘ సుమంగళీ భవ!” అని ఆశీర్వదించారు.

🌸వారి ఆశీర్వచనాలు ఫలించాలని దైవాన్ని ప్రార్థించింది సావిత్రి,ఆ రోజు కూడా సూర్యాస్తమయం వరకు ఉపవాసం కొనసాగించి, ఆ పైన వ్రతాన్ని ముగిస్తూ పారణ చేయాలని పతి

🌿వ్రతా శిరోమణి సావిత్రి నిశ్చయించుకుంది. ఇంతలో ఆ రోజున సమిధలు, దర్భలు, పండ్లు తీసుకురావడానికి సత్యవంతుడు. అడవికి బయలుదేరాడు.

🌸సావిత్రి కూడా ఎలాగో ఒప్పించి, ఆతని వెంట బయలుదేరింది. అడవికి వెళ్ళి కట్టెలు కొడుతుండగా సత్యవంతుడికి తీవ్రమైన శిరోవేదన పట్టుకుంది. దాంతో సావిత్రి తన ఒడినే దిండుగా చేసి, భర్తను నేల మీద పడుకోమంది.

🌿కొద్దిక్షణాలు కల్లా ఆమె ఎదుట ఓ దివ్యపురుషుడు కనిపించాడు. కాటుక లాంటి నల్లటి శరీరం, చింతనిప్పుల లాంటి కళ్ళు, చేతిలో పాశంతో ఉన్న ఆ వ్యక్తి సావిత్రి ఎదుట నిల్చొని, సత్యవంతుడి వంక చూస్తున్నాడు.

🌸అతను మృత్యుదేవత అయిన యముడు. సావిత్రి చూస్తూ ఉండగానే సత్యవంతుని శరీరం నుంచి జీవుణ్ణి వేరు చేసి, పాశంతో యమధర్మరాజు దక్షిణ దిశగా పురోగమించసాగాడు. కొంత దూరం వెళ్ళిన యమధర్మరాజు తన వెంట సావిత్రి కూడా వస్తున్న విషయాన్ని గుర్తించాడు.

🌿అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. “అమ్మా! ఇక నువ్వు నన్ను అనుసరించి రావద్దు. వెనక్కి తిరిగి వెళ్ళి, నీ భర్త మృతదేహానికి అంత్యక్రియలు జరిపించు” అని పేర్కొన్నాడు. కానీ, సావిత్రి మాత్రం “పతులు వెళ్ళే చోటకే సతులు పోవడం ధర్మం. కాబట్టి, నా భర్తను అనుసరించేందుకు నన్ను అనుమతించు. పతి వ్రతలు తమ భర్తలను వదిలి ఉండలేరు.

🌸ఇది శాశ్వత ధర్మం” అని పలికింది. సావిత్రి మాటలకు సంతోషించిన యముడు, “సాధ్వీ! నీ మాటలు, పతిభక్తి నాకు ముచ్చటేస్తున్నాయి. నీ భర్త అయిన సత్యవంతుడి ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకో” అన్నాడు.

🌿అప్పుడు సావిత్రి, “ఓ దేవదేవా! రాజ్యం పోగొట్టుకొని, అంధుడైన మామగారికి రాజ్యప్రాప్తి, నేత్రదృష్టి ప్రసాదించవలసింది” అని కోరింది. ఆమె ప్రార్థనను మన్నించిన యమధర్మరాజు అందుకు అంగీకరించి, “అలాగేనంటూ వరమిచ్చాడు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z