NRI-NRT

కెనడాలో హిందూ దేవాలయాల్లో ఒకేరోజు మూడు వరుస దోపిడీలు

కెనడాలో హిందూ దేవాలయాల్లో ఒకేరోజు మూడు వరుస దోపిడీలు

నడాలోని హిందూ దేవాలయాలే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు వరుస దొంగతనాలు జరగటం అక్కడి హిందువుల్ని ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనలపై కెనడా పోలీసులు అనుమానితుడి కోసం వెదుకులాట ప్రారంభించారు. నిందితుడి ఆనవాళ్లు చెబుతూ స్థానిక ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.‘గ్రేటర్‌ టొరొంటో ఏరియా(జీటీఏ)లోని ఓ హిందూ దేవాలయంలో దొంగ చొరబడి, అక్కడున్న డొనేషన్‌ బాక్సుల్లో నుంచి పెద్దమొత్తంలో నగదు చోరీ చేశాడు. అజాక్స్‌ పట్టణంలోనూ చోరీ జరిగింది. మొత్తం మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడింది ఒకే వ్యక్తి’ అని దుర్హాం రీజినల్‌ పోలీస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z