🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 12.10.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (12-10-2023)
వ్యాపార లావాదేవీలు చురుకుగా, సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అధికారులకు అండగా ఉంటారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు అనేక విధాలుగా ఉపయోగపడతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అర్ధాంగికి కూడా సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (12-10-2023)
సోదరులతో ఆస్తి వివాదాం పరిష్కారమై, సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు సానుకూలంగా ఉంటుంది. అనేక వ్యవహారాలను ఒకేసారి తలకెత్తుకోవడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకుంటే మంచిది. ఇంటా బయటా శ్రమ, తిప్పట ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహం కలిగిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందు కుంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (12-10-2023)
వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్లాన్ చేస్తారు. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి ముఖ్యమైన సమా చారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (12-10-2023)
పకడ్బందీగా కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. స్థిరమైన ఆలోచనలతో వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ముందుకు సాగుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వచ్చే అవ కాశం ఉంది. అర్ధాంగికి వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఆరోగ్యం సానుకూలపడు తుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (12-10-2023)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో కొనసాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొద్దిగా అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆదాయం పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవా లేదు.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (12-10-2023)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ, పట్టుదలగా వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తారు. బంధువుల నుంచి విమర్శలు, అపనిందలు తప్పకపోవచ్చు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తోబుట్టువులతో సామరస్యం పెరుగుతుంది. కుటుంబ సమే తంగా ఆలయాలు దర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారు లకు సన్నిహితం అవుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (12-10-2023)
వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆలోచనలు, ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఉద్యోగ జీవితం కూడా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. అర్ధాంగికి అనుకోని అదృష్టం పడుతుంది. పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (12-10-2023)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగు తుంది. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం వెనక్కు వెళ్లే అవ కాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అర్ధాంగికి అనుకూల వాతావరణం ఉంటుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (12-10-2023)
ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాలు బాగా వేగం పుంజుకుంటాయి. అర్ధాంగికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (12-10-2023)
వృత్తి, వ్యాపారాల మీద మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగాలలో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకా శాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లలు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సతీమణి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (12-10-2023)
ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా అందవచ్చు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (12-10-2023)
ఒకటి రెండు ప్రధానమైన కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. కొందరు బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికా రుల నుంచి గౌరవమర్యాదలు లభిస్తాయి. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాలు సంతృ ప్తికరంగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈
👉 – Please join our whatsapp channel here