🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 13.10.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (13-10-2023)
వృత్తి, వ్యాపారాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. దూర ప్రయాణాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ప్రోత్సాహకాలుంటాయి. ఆరోగ్యం పరవాలేదు.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (13-10-2023)
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇత రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలను, ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు విద్యా విషయాల్లో విజ యాలు సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగు తాయి.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (13-10-2023)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కదిద్దుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (13-10-2023)
వృత్తి, వ్యాపారాలకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుని నష్టాల్లోంచి బయటపడతారు. కొందరు దగ్గర బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. మిత్రుల నుంచి సహాయ సహ కారాలు ఉంటాయి. ఆదాయం పెరగడం వల్ల ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవు తాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (13-10-2023)
అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. ఉద్యో గులకు హోదాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగుపడి ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (13-10-2023)
ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. స్నేహితుల కారణంగా ఇబ్బం దుల్లో పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలక డగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. వృథా ఖర్చుల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (13-10-2023)
సమయం అనేక విధాలుగా అనుకూలంగా ఉంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగు లకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సతీమణికి ఉద్యోగపరంగా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (13-10-2023)
వృత్తి, ఉద్యోగాల్లో మరింతగా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధి స్తారు. వాహన యోగం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా సాగిపో తాయి. బంధువులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. స్వల్ప అనారోగ్యం తప్పక పోవచ్చు.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (13-10-2023)
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో సామ రస్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా ప్రాభవం పెరుగుతుంది. ఎటువంటి వ్యవ హారమైనా, పనైనా సానుకూలంగా పూర్తవుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (13-10-2023)
ఆదాయంలో ఆశించిన మెరుగుదల ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సమే తంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యో గులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (13-10-2023)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు సానుకూ లంగా సాగిపోతాయి. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. తండ్రి జోక్యంతో ఒక ఆస్తి వ్యవ హారం పరిష్కారం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (13-10-2023)
ఉద్యోగాల్లో అధికారులతో బాగా సన్నిహితం అవుతారు. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుం టాయి. తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సద్విని యోగం చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆధ్మాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈
👉 – Please join our whatsapp channel here