కారును పోలిన గుర్తులను తొలగించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ లిస్ట్‌లో ఉన్న రోడ్డు రోలర్‌లాంటి గుర్తులతో బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొనగా.. దీనిపై నేడు విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే, బీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తయిన కారును పోలిన గుర్తులను ఏ పార్టీ, అభ్యర్థికి కేటాయించొద్దని ఎన్నికల కమిషన్‌ను బీఆర్‌ఎస్ కోరుతూ వస్తున్నది. 2011లో రోడ్డు రోలర్‌ను ఎన్నికల కమిషన్ తొలగించింది.
గుర్తును మళ్లీ ఎన్నికల కమిషన్ చేర్చడంతో అభ్యంతరం తెలుపుతున్నది. రోడ్డు రోలర్‌తో పాటు చపాతి రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్కు గుర్తులు కారును పోలి ఉండడంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించొందని బీఆర్‌ఎస్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఆయా గుర్తులతో బీఆర్‌ఎస్‌కు నష్టం జరుగుతుందని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల కేంద్రం ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలోనూ కారు గుర్తును పోలిన ఫ్రీ సింబల్స్‌ను తొలగించాలని బీఆర్‌ఎస్ పార్టీ కోరింది. అయితే, ఇప్పటి వరకు ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో పిటిషన్‌ను దాఖలు చేసింది.
👉 – Please join our whatsapp channel here