తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
‘‘జైలులో నా భర్తకు సకాలంలో వైద్యం అందించట్లేదు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. జైలులో ఓవర్‌హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసరం వైద్యం అవసరం’’ అని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here