కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపిస్తూ ఆయన పార్టీని వీడారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పార్టీలో చోటుచేసుకుంటున్న వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పరువు పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు.
👉 – Please join our whatsapp channel here