ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది.. మనం ఏం చేయలేం అనుకో కూడదు.. అందరూ కలిసి చెడును కడిగేయాలి.. మహనీయులను ఎన్నుకోవాలి.. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి అంటూ పిలుపునిచ్చారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదా శివరావు శత జయంతి వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదాశివరావు లాంటి డాక్టర్ లు ప్రజా సేవకొసమే వైద్య వృత్తి లో కొనసాగారు.. రాజకీయాల్లో కూడా సదా శివరావు తనదైన శైలిలో సామాన్యులకు అందుబాటులో ఉన్నారని గుర్తుచేశారు.
మరోవైపు.. ఇప్పటి హాస్పిటల్ ల లో ఫీజులు మాత్రమే పరమావధితో వైద్యం చేస్తున్నారు అన్న అపవాదు ఉంది.. దాని నుండి వైద్య రంగం బయట పడాలి అని ఆకాక్షించారు వెంకయ్య నాయుడు.. ఇక, కులం,డబ్బు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారు.. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలన్నారు. చట్ట సభలు ప్రజలకు మేలు చేసే దేవాలయాలు.. వాటిని ప్రతీకారం తీర్చుకునే కోసం వాడుకోకూడదని హితవుపలికారు.. కులం చూసి కాదు, గుణం చూసి ఓటు వేయండి అని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ సందర్భంగా వైద్య, విద్యా, రాజకీయ రంగాలలో విశేష ప్రతిభ కలిగిన పలువురికి సేవ పురస్కారాలు అందించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
👉 – Please join our whatsapp channel here