Politics

వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ప్రశాంత్‌రెడ్డి తల్లి వేముల మంజులమ్మ(76) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ క్రమంలో ఇవాళ మంత్రి స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. మంజులమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎం వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌ కుమార్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు.

మంజులమ్మ భర్త వేముల సురేందర్‌రెడ్డి తెదేపా హయాంలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఛైర్మన్‌గా, తెరాస(ప్రసుత భారాస) రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో ఆయన మృతి చెందారు. మంజులమ్మకు ప్రశాంత్‌రెడ్డితో పాటు మరో కుమారుడు శ్రీనివాస్‌(అజయ్‌)రెడ్డి, కుమార్తె రాధిక ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z