మంచు లక్ష్మి.. టాలీవుడ్లో ఈ పేరు ఓ ఫైర్ బ్రాండ్. నటిగా.. యాంకర్‌గా.. హోస్టుగా.. నిర్మాతగా.. సింగర్‌గా.. ఇలా అన్ని రంగాల్లో తనేంటో నిరూపించుకుంది. మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన టాలెంట్‌తో నిలదొక్కుకుంటోంది. అయితే ఈ భామ కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. ఇక తాజాగా ఈమె మనసు బాలీవుడ్‌పై పడింది. బీ టౌన్లో అవకాశాల కోసం ఈ భామ తన మకాం ముంబయికి మార్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విటర్ వేదికగా తెలిపింది.
‘‘కొత్త నగరం.. కొత్త దశ.. ఈ జీవితం పట్ల నేనెంతో ఆనందంగా ఉన్నా. నన్నెంతగానో నమ్మి, నాకెప్పుడూ అండగా ఉండే అభిమానులకు ధన్యవాదాలు’’ అని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఇక ముంబయికి షిఫ్ట్ కాగానే తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడి తారలకు బర్త్ డే పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి బీ టౌన్ తారలు సుస్మితా సేన్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను, కుబ్రా సేట్ వంటి తారలు వచ్చారు.
ఇదే విషయంపై తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వృత్తిపరమైన పనుల నిమిత్తమే తాను ముంబయికి షిఫ్ట్ అయ్యానని చెప్పింది. ముంబయిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆడిషన్స్‌లో పాల్గొనేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. హిందీలో తెరకెక్కే వెబ్ సిరీస్‌లు, సినిమాల ఆఫర్స్ కోసం తాను సిద్ధమేనని తెలిపింది.
👉 – Please join our whatsapp channel here