ScienceAndTech

రేపు ఆకాశంలో అద్భుతం

రేపు ఆకాశంలో అద్భుతం

రేపు ఆకాశం లో ఓ అద్భుతం జరుగనుంది. రేపు ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది. ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనున్నది.ఈ దేశాల్లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ చివరిసారి 2012లో కనిపించగా, మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. దీని తర్వాత 2046 వరకు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా, ఈసారి సూర్యగ్రహణం భారత్ సహా అనేక దేశాల్లో కనిపించడం లేదు. ‘సూర్యగ్రహణం వేళ ఏర్పడే అద్భుతమైన వలయం చూసే అవకాశం అరదుగా వస్తుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని నాసా సైంటిస్ట్ పెగ్ లూసీ అన్నారు. ఆరోజు మధ్యాహ్నం 4:30 గంటలకు అంతరిక్షంలో సంభవించే అరుదైన దృశ్యాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయ నున్నది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z