Movies

ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రేణు దేశాయ్ ఫైర్

ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రేణు దేశాయ్ ఫైర్

పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఆద్య, అకిరా నందన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. పవన్ కల్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత తీసుకుని వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. అలాగే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కట్టి కౌంటర్స్ వేస్తుంది.

తాజాగా, ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు రేణు దేశాయ్ ఫుల్ ఫైర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకతను ఇంటర్వ్యూస్‌లో పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నలు అడగొద్దని చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. దానికి రేణు దేశాయ్ స్పందిస్తూ.. ‘‘నేను ఆయనతో కలిసి 11 ఏళ్లు కలిసి ఉన్నాను. ఆయన నా ఇద్దరు పిల్లలకు తండ్రి. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాలో లేదో అనేది పూర్తిగా నా ఇష్టం. జనాలు అలాంటి పాలసీ తీసేయండి. సోషల్ మీడియాలో ఏం చేయాలన్నది మీకు మేము చెప్పున్నామా. మీరు ఎవరు నాకు చెప్పడానికి’’ అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాస్టోరీలో షేర్ చేసింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z