Devotional

నవరాత్రులకు ముస్తాబవుతున్న శ్రీశైలం

నవరాత్రులకు ముస్తాబవుతున్న శ్రీశైలం

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 15 నుండి అక్టోబరు 24 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. దసరా మహోత్సవాలు ఏర్పాట్లు దసరా మహోత్సవాలకు విచ్చేయు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం సౌకర్యాలు అలానే వసతి, దర్శన ఏర్పాట్లు పారిశుధ్యం, ఉద్యానవనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో పెద్దిరాజు దేవస్థానం పరిపాలన భవనంలో వైదిక కమిటీ, అధికారులు, అర్చకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శరన్నవరాత్రి వేడుకలు ఈనెల 15 న ఉదయం స్వామివారి అమ్మవారి యాగశాలల ప్రవేశంతో ఘనంగా ప్రారంభమై అక్టోబర్ 24 న శ్రీ స్వామి అమ్మవార్ల పుష్కరిణిలో తెప్పోత్సవంతో ముగియనున్నాయి. ఉత్సవాల సమయంలో భక్తులు స్వామి అమ్మవారికి స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, కల్యాణోత్సవం యథావిధిగా కొనసాగుతాయన్నారు. గతంలో ఉత్సవాల సమయంలో నిర్వహించిన చండీహోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమం, నవవరణ పూజలు తాత్కాలిక నిలుపుదల చేస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజు వివిధ రూపాల్లో భక్తులకు భ్రమరాంబికాదేవి దర్శనమివ్వనున్నారు. శ్రీ స్వామివారు అమ్మవారితో కలిసి వివిధ వాహనాలపై క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

ఉత్సవాలలో విశేష అలంకారాలు, వాహనసేవలు

15 వ తేదీన శైలపుత్రి అలంకారం, స్వామి అమ్మవారికి బృంగివాహనం

16 వ తేదీన బ్రహ్మచారిణి అలంకారం స్వామి అమ్మవారికి మయూరవాహనం

17 వతేదీన చంద్రఘంట అలంకారం స్వామి అమ్మవారికి రావణవాహనం

18 వతేదీన కూష్మాండదుర్గ అలంకారం స్వామి అమ్మవారికి కైలాస వాహనం

19 వతేదీన స్కందమాత అలంకారం,స్వామి అమ్మవారికి శేష వాహనం

అక్టోబర్ 20 వతేదీన కాత్యాయని అలంకారం హంసవహననం.. పుష్పపల్లకిసేవ

21 వతేదీన కళరాత్రి అలంకారం స్వామి అమ్మవారికి గజవాహనం

22 వతేదీన మహాగౌరి అలంకారం స్వామి అమ్మవారికి నందివాహనం

23 వతేదీన సిద్ధిదాయిని అలంకారం స్వామి అమ్మవారికి అశ్వవాహనం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే దసరా మహోత్సవాల సందర్భంగా మల్లన్న భ్రమరాంబలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

24 వతేదీన శ్రీ భ్రమరాంబాదేవి నందివాహనం ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఆలయంలోని వృక్షం వద్ద శమీ పూజలు నిర్వహించి కర్పూర హారతినిస్తారు. ఆలయ పుష్కరిణిలో శ్రీ స్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగుస్తాయి.

ప్రముఖులకు ఆహ్వానం పలికిన ఈవో..
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 15వ తేది నుంచి 24 వరకు జరుగనున్న దసరా నవరాత్రోత్సవాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి శ్వాత్మనందేంద్ర సరస్వతి ను దేవస్థాన కమిటీ ఆహ్వాన పత్రికలను అందజేశారు.

శ్రీశైలంలో భక్తులకు దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు
శ్రీశైలం దసరా మహోత్సవాలకు వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తున్నారు. చలువ పందిళ్ళను, భక్తులకు క్యూలైన్సులో త్వరతగిన దర్శనాలు జరిగేటట్టు ఏర్పాట్లు చేశారు. ఆలయ పురవీధుల్లో భక్తులు వాహన సేవలను వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఎంతమంది భక్తులు వచ్చినా సౌకర్యవంతమైన దర్శనంతో పాటు అమ్మవార్లను ఉత్సవాలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీశైలంలో వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్షేత్ర పరిధిలోని పలుచోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా మహోత్సవాల్లో ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రత్యేక విధులు కేటాయించి.. తమకు కేటాయించి విభాగాల్లో భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచనలు చేశారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు ఉత్సవాలలో కళాకారుల నృత్యాలు, లంబాడా డాన్సులు, చెంచు గిరిజనుల నృత్యాలు కోలాటాలు, డూ డూ బసవన్నలు, డ్రమ్స్ నేపథ్యంలో సాయంత్రం జరిగే గ్రామోత్సవం చాలా కన్నుల పండగగా సాగి భక్తులను అలరిస్తుంది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z