శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తులు అవస్థలు పడాల్సి వచ్చింది. మహాలయ అమావాస్య, రెండో శనివారం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మరమ్మతుల కోసమని విద్యుత్తుశాఖ కరెంటు సరఫరా నిలిపివేసింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. భక్తులు చీకట్లోనే సర్పదోష నివారణ పూజలు చేయించాల్సి వచ్చింది. ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్, ఈవోలు అందుబాటులో ఉన్నా ఏమీ చేయలేకపోయారు. చీకట్లో పూజలు చేయించడమేంటని భక్తులు ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు.
👉 – Please join our whatsapp channel here