తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు శనివారం అంకుర్పాణ చేసారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు లగేజి, సెల్‌ఫోన్లు భద్రపరచుకునేందుకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ ఎదురుగా అదనంగా లగేజి కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో జిఎన్‌సి, టిబిసి, పిఏసి-4 వద్ద లగేజి కౌంటర్లు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పిఏసి-4 లగేజి కౌంటరును మూసి వేశారు.
భక్తులు సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వరాహస్వామి విశ్రాంతి గృహాలకు ఎదురుగా, కల్యాణవేదిక వెనుకవైపు గల శ్రీవారి సేవాసదన్ ఎదురుగా విశాలమైన ప్రాంతంలో అదనంగా 3 లగేజి కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం నుండి వెలుపలికి వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 19న గరుడ సేవ రోజు తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్లలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల భక్తులు ఇబ్బంది పడకూడదని, ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
👉 – Please join our whatsapp channel here