* మారుతి సుజుకి దసరా ఆఫర్లు
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా సందర్భంగా అన్ని రకాల కార్లపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంది. ఈనెల 15 వరకూ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇగ్నిస్, బాలెనో, సియాజ్ మోడల్ కార్లపై ‘ప్రీ నవరాత్రి‘ బుకింగ్స్ స్కీం కింద రూ.5000 వరకూ రాయితీ అందిస్తున్నది. దీంతోపాటు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్లు, క్యాష్ డిస్కౌంట్ల రూపంలో రాయితీలు అందిస్తున్నది.మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ సెడాన్ కారుపై రూ.17 వేల వరకూ డిస్కౌంట్లు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కార్లలో డిజైర్ ఒకటి.మారుతి కంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజాపై రూ.45 వేల రాయితీ అందిస్తుంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 103 హెచ్పీ విద్యుత్, 136.8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్ పై రూ.20 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ ధర రూ.8.29 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నది.మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ కారు స్విఫ్ట్‌పై రూ.47 వరకూ క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నది. సీఎన్జీ వేరియంట్ మీద రూ.33 వేల డిస్కౌంట్ లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.మారుతి సుజుకి సెడాన్ కారు సియాజ్ పై ప్రస్తుత పండుగల సీజన్‌లో రూ.53 వేల వరకూ డిస్కౌంట్లు అందిస్తున్నది. ఈ కారు ధర రూ.9.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.బాలెనో సీఎన్జీ వేరియంట్ పై గరిష్టంగా రూ.55 వేల రాయితీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ మోడల్ బాలెనో కారుపై రూ.40 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ.6.61 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) ప్రారంభం అవుతుంది.మారుతి వ్యాగన్ఆర్ కారుపై గరిష్టంగా రూ.58 వేల వరకూ రాయితీలు లభిస్తాయి. ఈ కారు ధర రూ.5.54 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ వేరియంట్ మీద రూ.68 వేల డిస్కౌంట్ లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ రూ.51 వేల వరకూ రాయితీలు పొందొచ్చు. ఈ కారు ధర రూ.5.36 లక్షల నుంచి మొదలవుతుంది.
* భారతీయ మార్కెట్లో లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లు లేదా బైకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో అడుగుపెట్టడానికి ఒకాయా (Okaya) నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిద్ధమైంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకాయ మోటో ఫాస్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిమీ నుంచి 135 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిమీ నుంచి 70 కిమీ కావడం గమనార్హం. ఇది అక్టోబర్ 17న అధికారికంగా లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.లేటెస్ట్ ఒకాయ మోటో ఫాస్ట్ స్కూటర్ ధర రూ. 1.50 లక్షల వరకు ఉండవచ్చు. రోజు వారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LFP బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ సియాన్, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది కాబట్టి ఆఫర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ద్వారా స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్, టైమ్ మరియు బ్యాటరీ శాతం వంటి వాటిని చూపిస్తుంది. బ్రేకింగ్ సిస్టం, సస్పెన్షవ్ వంటివి కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
* నేడు తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కాగా చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు. అయితే నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్: రూ. 966.వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ.927,గుంటూర్: రూ. 944.
* శాంసంగ్‌కు వన్‌ప్లస్ పోటీ
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (One Plus) తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ ఓపెన్ (One Plus Open)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 19న వన్ ప్లస్ ఓపెన్ భారత్ మార్కెట్లోకి రానున్నది. ఇప్పటి వరకూ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో దక్షిణ కొరియా శాంసంగ్ (Samsung)దే ఆధిపత్యం. మెరుగైన అనుభవం కోసం వన్‌ప్లస్ తెస్తున్న వన్‌ప్లస్ ఓపెన్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Fold 5) ఫోన్‌కు వన్ ప్లస్ గట్టి పోటీదారుగా నిలుస్తుందని భావిస్తున్నారు.స్లిమ్ డిజైన్‌తో రూపుదిద్దుకున్న వన్ ప్లస్ ఓపెన్ లైట్ వెయిట్ ఉంటుంది. వన్ ప్లస్ ఓపెన్ ఫోన్‌పై ఎటువంటి ముడతలు ఉండవని చెబుతున్నారు. ప్రస్తుత ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల స్టాండర్డ్‌ను వన్ ప్లస్ ఓపెన్ తదుపరి లెవెల్‌కు తీసుకెళ్తుందని వన్ ప్లస్ పేర్కొంది. ఫోల్డబుల్ ఫోన్ల కాన్సెప్ట్‌కే పునర్నిర్వచనం ఇస్తుందని వెల్లడించింది.వన్ ప్లస్ ఓపెన్ భారత్ మార్కెట్ లో రూ.1,41,490 (1699 డాలర్లు) పలుకుతుందని భావిస్తున్నారు. వన్ ప్లస్ ఓపెన్ ధర వెల్లడైన తర్వాత శాంసంగ్ కంటే వన్ ప్లస్ బెటర్ అని యూజర్లు అభిప్రాయ పడతారని చెబుతున్నారు.వన్ ప్లస్ ఓపెన్ 7.8 అంగుళాల ఓపెన్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, కవర్ డిస్ ప్లే 6.3 అంగుళాలు ఉంటుందని తెలుస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
* మోసానికి పాల్పడుతున్న ఆండ్రాయిడ్ యాప్‌లు
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్‌హెచ్‌సీ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్‌ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్‌లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు
వాహనదారులు ఎక్కువగా వినియోగించే గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ప్రతి నెల 1 తేదీన సవరిస్తుంటారు. కానీ, కొన్ని నెలల నుంచే ఈ ధరల్లో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 109.66,లీటర్ డీజిల్ ధరలు: రూ. 98.31.విశాఖపట్న:లీటర్ పెట్రోల్ రేట్లు: రూ. 110.48,లీటర్ డీజిల్ ధరలు: రూ. 98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 111.76,లీటర్ డీజిల్ ధరలు: రూ.99.
* ఢిల్లీ: పెరిగిన ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ ట్రాఫిక్
తమ ఎయిర్‌పోర్టుల్లో ప్యాసింజర్ ట్రాఫిక్ఈ ఏడాది సెప్టెంబరులో వార్షికంగా 23 శాతం పెరిగి 94.16 లక్షలకు చేరిందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటించింది. అయితే నెలవారీగా ఇది కాస్త తగ్గింది. సంస్థ షేర్లు శుక్రవారం 0.4 శాతం లాభపడ్డాయి. ఇదే కాలంలో ఎయిర్‌ట్రాఫిక్ మూవ్మెంట్ వార్షికంగా 14 శాతం పెరగగా, నెలవారీగా నాలుగు శాతం తగ్గి 62,230 లకు చేరింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి గరిష్టంగా 58,02,348 మంది ప్రయాణించారు. వార్షికంగా వీరి సంఖ్య 14 శాతం పెరిగింది. హైదరాబాద్ నుంచి 19,69,753 రాకపోకలు సాగించారు. వీరి సంఖ్య 21 శాతం పెరిగింది .గోవా ఎంఓపీఏలో ఇది 10 శాతం పెరిగి 3,26,952 మందికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయం 2024 మొదటి ఆర్నెళ్లలో రికార్డుస్థాయిలో 3.5 మిలియన్ల ప్రయాణీకుల మార్కును దాటిందని జీఎంఆర్ తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం 2024 మొదటి ఆర్నెళ్లలో 1.2 మిలియన్ ప్రయాణీకుల మార్కును దాటింది. ఈ ఏడాది జూన్‌లో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రా స్టాండ్‌లోన్ నికర అమ్మకాలు విలువ రూ. 66.77 కోట్లకు చేరుకుంది. వార్షికంగా వీటి విలువ 185.34 శాతం పెరిగింది. జూన్ 2022లో 23.40 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. నికర లాభం జూన్ 2022లో 21.14 కోట్లు కాగా ఈసారి 144.61 శాతం వృద్ధి చెందింది. ఇబిటా రూ. 65.51 కోట్లకు పెరిగింది.
👉 – Please join our whatsapp channel here