టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య స్థితిపై.. ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. లాయర్లు, చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల సూచనలతో న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్యుల నివేదిక మేరకే మెరుగైన వైద్యం అందించాలని న్యాయవాదులు కోర్టును కోరారు.ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని వైద్యులు జైలర్‌కు నివేదించారు. అయితే న్యాయవాదులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు వాదనలు విననుంది. లోకేశ్ చంద్రబాబుతో ములాఖత్ అయిన అనంతరం న్యాయవాదులతో మాట్లాడారు.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z