శ్రీవారి ఆలయంలో అక్టోబరు 15 నుంచి 23 వరకు వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
విశేషంగా ఆకట్టుకున్న పుష్ప.. ఫొటో ప్రదర్శన
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్ప, ఫొటో ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా తితిదే గార్డెన్ విభాగం ..హిందూపురారణాలలోని అపురూప ఘట్టాలతో పాటు, ద్రౌపది వస్త్రాపహరణం, వసుదేవుడు చిన్ని కృష్ణుని కావేరి నంది దాటిస్తున్న సన్నివేశం, గజేంద్రమోక్షం, బకాసురుడు, ఘటోత్కజుడు(మాయాబజార్) సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షషణగా నిలిచాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప, ఫోటో ప్రదర్శన మరింత ఆధ్యాత్మిక శోభను తెచ్చాయి.
👉 – Please join our whatsapp channel here