‘న్యాయానికి సంకెళ్లు’ పేరిట మరో నిరసన కార్యక్రమానికి తెదేపా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన సీఎం జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (15న) రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను కట్టుకొని నిరసన తెలియజేయాలన్నారు. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించాలని కోరారు. ఆ వీడియోలు ఫొటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులను, అభిమానులను లోకేశ్ కోరారు.
👉 – Please join our whatsapp channel here