ఎన్నికల వేళ బీఆర్ఎస్ మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పంపించారు. గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ లక్ష్మీనారాయణ.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన పార్టీ వీడటంపై ఖమ్మం బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని అధిష్టానం సముచిత స్థానం కల్పించనప్పటికీ గుడ్ బై చెప్పడంపై మండిపడుతున్నారు. సమస్యలు ఉంటే పార్టీలో చర్చించుకోవాలని కానీ, ఎన్నికల వేళ రాజీనామా చేసి పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తించడం సరికాదని విమర్శలు చేస్తున్నారు.
https://i.postimg.cc/K8sK1g66/brs.webp
👉 – Please join our whatsapp channel here