దుర్గగుడిలో అంబరాన్నంటే దసరా సంబరాలు (Dussehra celebrations) ఆరంభమయ్యాయి. బెజవాడ దుర్గమ్మ ఈ రోజు బాలత్రిపురసుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దుర్గమ్మను తొలి దర్శనం చేసుకున్నారు. గవర్నర్‌కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.దుర్గమ్మ ఈ ఏడాది తొమ్మిది రోజుల్లోనే పది అవతారాల్లో దర్శనమివ్వనుంది. మొదటి రోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా, రెండో రోజు సోమవారం గాయత్రీదేవి, మూడో రోజు అన్నపూర్ణాదేవి, నాలుగో రోజు మహాలక్ష్మీదేవి, ఐదో రోజు శ్రీమహాచండీదేవి, ఆరో రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఏడో రోజు లలితా త్రిపుర సుందరీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మహిషాసుర మర్దినిదేవి, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు రాజరాజేశ్వరీదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు అభయం ఇవ్వనున్నారు.
👉 – Please join our whatsapp channel here