NRI-NRT

ఎన్నికల ప్రచారంలో చురుగ్గా బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా

ఎన్నికల ప్రచారంలో చురుగ్గా  బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా

అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింన సంగతి తెలిసిందే. ఈరోజు సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అద్వ్యర్యములో సౌత్ ఆఫ్రికా శాఖ కార్యవర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు,

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెల‌వ‌బోతుంద‌ని బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్య‌క్షుడు గుర్రాల నాగ‌రాజు పేర్కొన్నారు. బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ కార్య‌వ‌ర్గ స‌భ్యులు రాష్ట్రంలోని త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్ర‌చారంలో పాల్గొంటార‌ని నాగ‌రాజు చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్ని సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్ర‌చారం చేస్తార‌ని అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ స‌భ్యులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏండ్ల‌ పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేద‌న్నారు. కేవలం తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింద‌ని వారు పేర్కొన్నారు. క‌నుక ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంద‌న్నారు.

ప్రత్యక్ష ప్రచారంతోపాటు వివిధ సోషల్ మీడియా వేదిక‌ల‌ ద్వారా బీఆర్ఎస్ అభ్య‌ర్థుల మ‌ద్ద‌తుతా ప్రచారం చేస్తామని గుర్రాల నాగ‌రాజు అన్నారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అవుతున్నదని పేర్కొంటూ వివిధ సంక్షేమ పథకాలను తమ కార్య వర్గ సభ్యులు వీడియో రూపంలో వివరించి ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.

ఆదివారం సీఎం కేసీఆర్ విడుద‌ల చేసిన‌ బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రూపొందించారని బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ స‌భ్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించ‌డం ఖాయం అని తేలిపోయిందన్నారు. ఆదివారం సోషల్ మీడియా వేదిక‌గా ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ ఎన్నికల ప్రచార సమావేశంలో బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ నాయ‌కులు నరేందర్ రెడ్డి మేడసాని, హరీష్ రంగ, జ్యోతి వాసిరెడ్డి, శీరిష కట్టా, సౌజన్ రావు, సాయి కిరణ్ నల్ల, వెంకట్ రావు, నవదీప్ రెడ్డి గుడిపాటి, కిరణ్ కుమార్ బెల్లి, శివా రెడ్డి, అరవింద్ ప్రసాద్ చికోటి, నరేష్ తేజ, శ్రీనివాస్ రేపాల, వూరే వంశీ,రంజిత్ కుమార్, ఆన్ లైన్ ద్వారా జైగుండా విష్ణు, నామా రాజేష్ పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z