వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు.. కాంగ్రెస్‌కు కొంత నష్టమేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గుర్తింపునిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. ఆయన పార్టీ మారడం బాధాకరమన్నారు. టికెట్ రానంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని పొన్నాల నిందించడం తగదన్నారు. టికెట్లు దక్కని పార్టీ నేతలు ఎన్నికల్లో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here