సామాజిక మాధ్యమాలను చాలా అరుదుగా వాడుతుంటారు నటుడు ప్రభాస్ (Prabhas). కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే ఆయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉపయోగిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టా ఖాతా కనిపించడం లేదు.
ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’ అనే సందేశం వస్తోంది. ఆయన ఖాతా హ్యాకింగ్‌కు గురైందా.. లేదా డి-యాక్టివేట్ చేశారా.. తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఈ విషయం పట్ల ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జులై నెలలో ఆయన ఫేస్‌బుక్ ఖాతా కూడా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే. ‘మనుషులు దురదృష్టవంతులు’ అంటూ ఆనాడు హ్యాకర్లు ఓ వీడియో షేర్ చేశారు.ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌నీల్ తీర్చిదిద్దుతోన్న ‘సలార్’ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. వీటితోపాటు మారుతి డైరెక్షన్‌లో ‘రాజా డీలక్స్’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నారు.
👉 – Please join our whatsapp channel here