Politics

పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం

పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం

న్యాయపరమైన అంశాల వల్లే సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్థానాల్లో కొన్నిచోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. జాబితా విడుదల అనంతరం తొలిసారిగా తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ‘‘కొన్నిచోట్ల అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడ అభ్యర్థిని మార్చాం. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయి. ఎన్నికల వేళ కోపతాపాలు ఉంటాయి.. సహజమే. అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం.

మన నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారు. మనవాళ్లు గెలిచినా సాంకేతికంగా ఇబ్బంది పెడతారు. వనమా వంటి నాయకుల విషయంలో అలా జరిగింది. సందేహాలు ఉంటే మన న్యాయబృందాన్ని సంప్రదించండి. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు. ఇవాళ, రేపు బీఫామ్‌లు అందిస్తాం. ఒక్కో అభ్యర్థికి రెండు బీ బీఫామ్‌లు అందిస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. భోజన విరామం తర్వాత భారాస ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z