Politics

కాసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్నా కేసీఆర్

కాసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్నా కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి బీఫాంలు అందజేయనున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో మార్పు తప్పదనే లీకులు ఇవ్వడంతో ఎవరెవరికి అధిష్టానం మొండిచెయ్యి చూపనుందనేది పార్టీ అభ్యర్థులు, నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశావహుల్లో మాత్రం టికెట్లపై ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఐదు నియోజకవర్గాలకు సైతం అభ్యర్థులను ప్రకటించనున్నారు. మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుండటంతో కొత్త పథకాలు, హామీలు ఏముండే అవకాశం ఉందనే ఆసక్తి నెలకొంది. కాగా, ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం దాదాపు 56 రోజుల తర్వాత ఈ నెల 15న కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తున్నారు.ప్రజల్లోకి ఎలా వెళ్లాలి.. పదేళ్ల ప్రగతిపై ఎలా వివరించాలి.. సంక్షేమ, అభివృద్ధిని వివరించే విధానంపైనా సూచనలు చేయనున్నారు. కాగా, నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. నేతలతో సంప్రదింపులు జరిపి ఇప్పటికే అభ్యర్థులను సెలక్ట్ చేశారు. వారిని ఆదివారమే ప్రకటించడంతోపాటు పార్టీ భీపాంలను అందజేయనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z