Movies

షారుఖ్‌తో రవితేజ మల్టీస్టారర్

షారుఖ్‌తో రవితేజ మల్టీస్టారర్

మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లోనే తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న సినిమా ఇది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీతో కలిసి రవితేజ నార్త్ లో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ముంబైలో పింక్ విల్లాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాస్ మాహారాజా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన బయోపిక్ చేస్తే టైటిల్ ఏంటీ ?.. మీ పాత్రలో ఎవరు నటించాలనుకుంటున్నారు ? అని ఓ అభిమాని అడగ్గా.. ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు రవితేజ. తన బయోపిక్ టైటిల్ అంటూ ఆలోచిస్తుండగా.. మాస్ మాహారాజా అంటూ అభిమానులు అరిచారు. దీంతో అదే టైటిల్ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన బయోపిక్ లో హీరోగా తనే నటించాలని ఉందని తెలిపాడు. ఇక అదే సమయంలో డైరెక్టర్ వంశీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు రవితేజ, షారుఖ్ ఖాన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయాలని ఉందని తెలిపాడు.

ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు వంశీని ముందుగా తను ఇంకా దర్శకత్వం వహించని, భవిష్యత్తులో దర్శకత్వం వహించాలనుకుంటున్న నటుడి గురించి అడిగారు. ఇందుకు డైరెక్టర్ స్పందిస్తూ.. “నేను షారూఖ్ సార్ తో సినిమా చేయాలనుకుంటున్నాను.. ఇది డ్రీమ్ యాక్టర్ గురించి కాదు. నేను ఎప్పుడూ సవాళ్లను స్వీకరించే నటులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. అలాంటి నటుల్లో షారుఖ్ సార్ కూడా ఒకరని నేను అనుకుంటున్నాను. కాబట్టి షారూఖ్ సార్” అని సమాధానమిచ్చాడు.

అలాగే వాల్తేరు వీరయ్య ఘనవిజయం తర్వాత మరో ఇద్దరు హీరోల చిత్రాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారా ? అని రవితేజను అడగ్గా.. “నేను ఏ నటుడితోనైనా పని చేయాలనుకుంటున్నాను. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇష్టపడతాను. యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తాను.. అని అన్నారు. ఇక ఆ తర్వాత మీరు ఇద్దరు హీరోలతో సినిమా చేయాలనుకుంటే ఎవరెవరితో తీస్తారు అని అడగ్గా.. డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ… తనకు రవితేజ, షారుఖ్ ఇద్దరితో కలిసి సినిమా చేయాలని ఉందని.. అది కూడా హాలీవుడ్ మూవీ బ్యాడ్ బాయ్స్ తరహాలో వీరిద్దరిని నెగిటివ్ షేడ్స్ లో చూపించాలని ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ వంశీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z