Politics

‘ఎ’ ఫారం ‘బి’ ఫారం అంటే ఏమిటి?

‘ఎ’ ఫారం ‘బి’ ఫారం అంటే ఏమిటి?

ఎన్నికల సమయంలో సాధారణంగా ‘ఎ’ ఫారం, ‘బి’ ఫారం అంటూ వింటుంటాం. ఇదేమిటనేది చాలా మందికి తెలియదు.

‘ఎ’ ఫారం…
తమ పార్టీ అభ్యర్ధిగా ఎవరినైతే ఎంపిక చేసి ‘బి’ ఫారం అందించనున్నారో ఆ ‘బి’ ఫారం అందించే వ్యక్తికి ఇచ్చేదే ‘ఎ’ ఫారం. పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ‘ఎ’ ఫారం అందిస్తుందో ఆయనకు మాత్రమే తమ పార్టీ అభ్యర్ధులకు ‘బి’ ఫారం అందించే అధికారం ఉంటుంది. ‘ఎ’ ఫారం అందుకున్న పార్టీ ప్రతినిధి ముందుగా తనకు లభించిన ‘ఎ’ ఫారాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు.

‘బి’ ఫారం…
గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధులు వీరే అంటూ పార్టీ ప్రతినిధి ఇచ్చేది ‘బి’ ఫారం. నామినేషన్‌ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ఆ పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫారాన్ని అందజేస్తారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z