హైదరాబాద్లో ‘భగవంత్ కేసరి’ ప్రెస్మీట్లో బాలకృష్ణ తన విగ్గు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘దేవాలయంలో మనం చేసే ప్రదక్షిణలు, దైవ నామస్మరణ 108తో ముడిపడి ఉంటాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నా 108వ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కూడా ఆ నేపథ్యంలో రూపొందిందే. అప్పట్లో మేమంతా కలిసి భోజనం చేసేవాళ్లం. కారవాన్లు లేవు. చాప, దిండు వేసుకుని నేలపైనే పడుకునేవాళ్లం. ఆ సమయంలో విగ్గు తీసేవాణ్ని. ఈయన విగ్గు పెట్టుకుంటాడు అని ఇటీవల ఒకాయన ఎగతాళిగా మాట్లాడాడు. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా.. నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగా. మనదంతా ఓపెన్ బుక్. ఎవరికీ భయపడేదే లేదు’’ అని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here