Devotional

ఇంద్ర‌కీలాద్రిపై గాయ‌త్రీదేవిగా నేడు దుర్గ‌మ్మ సాక్షాత్కారం

ఇంద్ర‌కీలాద్రిపై గాయ‌త్రీదేవిగా నేడు దుర్గ‌మ్మ సాక్షాత్కారం

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండో రోజైన సోమ‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ విదియ‌) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ గాయ‌త్రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. వేద‌మాత‌గా ప్ర‌సిద్ధి పొందిన ఈ త‌ల్లి … ముక్తా, విద్రుమ‌, హేమ‌, నీల‌, ధ‌వ‌ళ వ‌ర్ణాల‌తో ప్ర‌కాశిస్తూ భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది. పంచ ముఖాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చే సంధ్యావంద‌న అధిష్టాన దేవ‌త అయిన గాయ‌త్రీదేవిని పూజిస్తే స‌క‌ల ఉప‌ద్ర‌వాలూ తొల‌గుతాయ‌నీ, బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ రోజున వంగ‌, ఆకుప‌చ్చ‌, బంగారు వ‌న్నెల చీర‌ల్లో కొలువుదీరిన అమ్మ‌వారికి నైవేద్యంగా పులిహోర‌, కేస‌రి, పుల‌గాల‌ను స‌మ‌ర్పిస్తారు.సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధంఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z