తెలుగుతల్లి కెనడా-ఓంటారియో తెలుగు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా “పాడనా తెలుగు పాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కెనడా సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే టొరాంటో నగరంలోని రీజెంట్ థియేటర్ లో ఘనంగా నిర్వహించారు. రాయవరపు విజయగోపాల రాజు, లక్ష్మి రాయవరపు, మురళి పగిడేల, శివజ్యోతి పగిడేల, శ్రీనివాస్ నారు, పద్మిని నారు జ్యోతి వెలిగించారు. రుక్మిణి మద్దులూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, ప్రముఖ సంగీత దర్శకులు డా. జోశ్యభట్ల, గాయని ఆర్. దమయంతిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 27 మంది ఈ తుదిసమరంలో పోటీపడ్డారు. రమేష్ గొల్లు, ఆనంద్ పెరిచెర్ల, రఘు జూలూరిలు బహుమతి ప్రదానం చేశారు. శ్రీవాణీ ముప్పళ్ల, ఝాన్సీ లక్ష్మి గరిమెళ్ల, హర్ష దీపిక రాయవరపు, ప్రసాద్ ఘట్టి, ప్రవీణ్ నీలా, రామ్-అమృత జిన్నాల, వసంతలక్ష్మి అయ్యగారి, ఝాన్సీలక్ష్మి రాపర్తి, సుభద్ర ప్రభ, పారిజాత బర్దిపూర్, శశికళ స్వామీ, సురేఖ మూర్తి, స్వామి నారాయణ తదితరులు సహకరించారు. అనంత శ్రీరామ్, తాతా బాల కామేశ్వరరావు, ప్రకాశ్ వీరమల్లల శుభాకాంక్షల వీడియో ప్రదర్శించారు. వంశీ రామరాజుని విశ్వ కళా సేవా భూషణ బిరుదుతో సత్కరించారు.
*** విజేతలు:
ప్రీ టీన్స్ విభాగంలో వికసిని అలవలపాటి, సాహితీ యలమంచిలి, హేమాన్వి సిరిమండ్లలు,
టీన్స్ విభాగంలో ఆశ్రిత పొన్నపల్లి, మీనా కూచిమంచి, శ్రేయస్ ఫణి పెండ్యాలలు,
అడల్ట్స్ విభాగంలో గాయత్రి తణుకు, రోహిణి చేబియ్యం, మనోభిరాం నెల్లుట్లలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z