త్వరలోనే తాను విశాఖకు షిప్ట్ అవుతున్నానని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేవారు. విశాఖలో ఇన్ఫోసిస్ డెలవప్ మెంట్ సెంటర్, బీచ్ క్లీనింగ్ యంత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ డిసెంబర్‌లోపు విశాఖకు మారతానని చెప్పారు. పరిపాలన విభాగమంతా విశాఖకు వస్తుందని తెలిపారు. విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని జగన్ పేర్కొన్నారు. విశాఖ పట్టణం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరమన్నారు. విశాఖలో అద్భుతమైన ఎయిర్‌పోర్టు ఉందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా తయారైందని సీఎం జగన్ చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
👉 – Please join our whatsapp channel here –