ఎవరి మేనిఫెస్టో చిత్తు కాగితమో ప్రజలే తేలుస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో సంపదను సృష్టించి పంచడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే ప్రాధాన్యతే పాడి పరిశ్రమకూ ఇస్తారని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఆరితేరారని విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని అన్నారు. కాగా, నిన్న బీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి.. బీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారని విమర్శించారు. తమ అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ వారి అభ్యర్థులకు బీ-ఫామ్‌లు పంచారని అన్నారు. అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందు ఉందన్నారు. తాము 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ కేవలం 51 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –