పాలమూరు – రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్‌కు కృష్ణా జలాలు రాకపోవడానికి కారణం ఎవరని అడిగారు. వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తెచ్చేందుకు జైపాల్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్ రైలు రాకపోవడానికి కేసీఆరే కారణం. రాజకీయాల్లో ఈ ప్రాంత ప్రజలకు తెలియని రౌడీయిజాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. జిల్లా కాంగ్రెస్ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేయించారు. నీళ్లు జగన్‌రెడ్డి తీసుకుపోయారు. నిధులు కృష్ణారెడ్డి తీసుకుపోయారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలు తీసుకుంది. ఉద్యోగ పరీక్ష జరగలేదనే బెంగతో మొన్న యువతి ఆత్మహత్య చేసుకుంది’’ అని రేవంత్ అన్నారు. తెలంగాణ దశ.. దిశ మార్చే సమయం వచ్చిందని, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.
👉 – Please join our whatsapp channel here