కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి వేంకటేశ్వర స్వామివారు హంసవాహనంపై సరస్వతీ అలంకారంలో వీణ ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారి వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.హంసవాహన సేవలో శ్రీమలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే గుణం దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో ఏకమైన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని కలిగించేందుకే శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –