సనత్ నగర్ లో వేల కోట్ల అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ లో అత్యధిక మెజార్టీతో గెలుపు తథ్యమని సోమవారం నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ముందుగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేదిక వరకు ఘనస్వాగతం పలికారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని పార్టీకి చెందిన కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు సిక్కు సమాజ్, గుజరాత్ సమాజ్, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, వివిధ బస్తీలు, కాలనీల అసోసియన్ ల ప్రతినిధులు పాల్గొని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.భారీ మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని, అత్యధిక మెజార్టీ సాధించడం కోసమే కష్ట పడాల్సి ఉందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 19 వ తేదీ నుండి నియోజకవర్గంలో పాదయాత్రలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా వచ్చే నెల 9 వ తేదీన భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం సనత్ నగర్ నియోజకవర్గం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటుందని తెలిపారు. బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ నుండి సిటీ లైట్, బాటా, ప్యాట్నీ, హరిహర కళాభవన్ మీదుగా నార్త్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.
పార్టీలకు అతీతంగా తమ వద్దకు ఎవరు వచ్చిన వారి సమస్యలను పరిష్కరించామని వివరించారు. గతంలో ఇక్కడి నుండి గెలిచి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మర్రి చెన్నారెడ్డి కూడా చేయలేని అనేక అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. తన గెలుపు కోసం ఎంతో శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప, ఉప్పల తరుణి, కిరణ్మయి, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేషన్ రాజు హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here