దయచేసి టీపీసీసీ రేవంత్ రెడ్డిని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడకండని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. ‘దయచేసి అందరూ నాయకులకి చేతులెత్తి నమస్కరిస్తూ చెబుతున్న. అధిష్టానం అందరి పెద్దలు కలిపి నిర్ణయాలు తీసుకొని టికెట్లు కేటాయిస్తారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ గెలవాలి గెలిచి తీరాలి అన్న సంకల్పంతో అందరం ముందుకెళ్లండి, అధికారంలోకి వస్తే ఎన్నో పదవులు ఎన్నో అవకాశాలు ఎంతో సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది. స్వార్థాలతో పార్టీలు మారుతున్న పెద్ద నాయకులారా. వయసు పెరగడం కాదు, కావాల్సింది వివేకం పెరగడం ప్రధానం, గుర్తుపెట్టుకోండి’ అంటూ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –