విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతున్న కోడి కత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. 8 వారాలపాటు విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కోడికత్తి కేసులో సీఎం జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ గతంలో జగన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –