ప్రజల హృదయాల్లో తాను సీఎం కావాలని ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు నేనుగా ఏ పదవీ కోరుకోవట్లేదు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదు అనను. ఏ సీఎం చేయనన్ని శాఖలు నేను నిర్వర్తించా. 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చా.. 36 ఏళ్లకే మంత్రిని అయ్యా. నాకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయి’’ అని జానారెడ్డి వ్యాఖ్యానించారు.
👉 – Please join our whatsapp channel here –