Movies

విడుదలకు ముందే అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా ‘లియో

విడుదలకు ముందే అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా ‘లియో

విజయ్ ‘లియో’ (Leo) విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు విడుదల దగ్గరపడుతుండడంతో మరికొన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ‘లియో’ హవానే కొనసాగుతోంది. ఎక్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన నాలుగు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

స్టార్‌ హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్‌ల ‘విక్రమ్‌’, ‘జైలర్‌’ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. అయితే ఓవర్సీస్‌లో వీటి టికెట్ల సేల్స్ మిలియన్‌ మార్క్‌ను చేరుకోలేకపోయాయి. తాజాగా ‘లియో’ ఆ మార్క్‌ను అవలీలగా చేరుకుంది. ఈ సినిమా విడుదల రెండు రోజుల ముందే ఓవర్సీస్‌లో దీని టికెట్లు వన్‌ మిలియన్‌ డాలర్లకు పైగా అమ్ముడయ్యాయి. మరోవైపు యూకేలోనూ రిలీజ్‌కు ముందే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన ఇండియన్‌ సినిమాగా ‘లియో’ రికార్డు సృష్టించింది. 30ఏళ్ల సినీ కెరీర్‌లో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్న విజయ్‌ తొలిచిత్రం ‘లియో’ కావడం విశేషం. ఇక గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా విడుదలకు ముందే అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో వన్‌ మిలియన్ల డాలర్లను వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోనూ ‘లియో’ హవా కనిపిస్తోంది. అక్కడ మొదటిరోజు 15000 టికెట్లు అమ్ముడయ్యాయి

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z