Politics

రేవంత్ రెడ్డి అరెస్టు

రేవంత్ రెడ్డి అరెస్టు

గన్‌పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరి గన్‌పార్క్‌ వద్దకు పార్టీ నేతలతో కలిసి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకొని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళదామని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్‌ సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి రేవంత్‌ గన్‌పార్క్‌ వద్దకు వెళ్లగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z