అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామివారికి సింహ వాహనసేవ నిర్వహించారు. సింహ వాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. రాత్రి 7 గంటలకు శ్రీవారికి ముత్యపు పందిరి వాహనసేవ నిర్వహించనున్నారు.
సింహ వాహనం – ధైర్య సిద్ధి…..దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీవారు సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది.
👉 – Please join our whatsapp channel here –