కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు.ముత్యాల నిర్మలమైన కాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తి పొందేందుకు రాత్రి వేళ అనుకూలం. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలా మారి, జనన, మరణచక్రం నుంచి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు , రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇనుమడింపజేసుకొని ఉత్సాహాన్ని, ప్రశాంతతను పొందుతారు.
👉 – Please join our whatsapp channel here –