WorldWonders

కాశ్మీర్‌లో అమ్మవారికి మొదటి పూజ

కాశ్మీర్‌లో అమ్మవారికి మొదటి పూజ

ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. కుప్వారా జిల్లా (Kupwara District) టీట్వాల్ గ్రామంలోని చారిత్రక శారదా మాత దేవాలయంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిత తరువాత తొలిసారిగా నవరాత్రి పూజ నిర్వహించారు. సరిహద్దుకు సమీపాన ఉన్న ఈ దేవాలయంలో పూజలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అమ్మవారికి పూజలు (Puja to Goddess) చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ దేవాలయ పునరుద్ధరణలో హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక పాత్ర పోషించారు. మార్చి 23న ఆయన వర్చువల్‌గా దేవాలయాన్ని ప్రారంభించారు. కశ్మీర్‌ లోయలో శాంతియుత వాతావరణ స్థాపనకు ఇది నిదర్శనమని అప్పట్లో షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ (PM MODI) సారథ్యంలో కశ్మీర్‌లో ఆధ్యాత్మిక సంస్కృతి పునరుద్ధరణ జరిగిందన్నారు. స్వాతంత్ర్యానికి (Independence) పూర్వం ఉన్న స్థలంలోనే, అప్పటి డిజైన్ ఆధారంగానే నూతన దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. నాటి కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.