Politics

నిర్మలా సీతారామన్‌తో విజయసాయిరెడ్డి సమావేశం

నిర్మలా సీతారామన్‌తో విజయసాయిరెడ్డి సమావేశం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు వివిధ అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. అనంతరం నిర్మలతో భేటీకి సంబంధించిన ఫొటోలను విజయసాయి రెడ్డి తన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రిని కలిశానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆమెతో చర్చించానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z