కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. డియర్నెస్ అలవెన్సును (DA) 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధాని మోదీ (PM modi) నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదించినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండు సార్లు డీఏ పెంచుతుంది. కేంద్రం డీఏ సవరించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అధికారికంగా సాయంత్రం దీనిపై ప్రకటన వెలువడనుంది.
👉 – Please join our whatsapp channel here –